Vladimir Putin: భారత్‌లో రెండోరోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారత్‌లో పర్యటిస్తోన్నారు.

Update: 2025-12-05 05:39 GMT

Vladimir Putin: భారత్‌లో రెండోరోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారత్‌లో పర్యటిస్తోన్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పుతిన్ రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. పదకొండున్నర గంటలకు రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మగాంధీ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. 11 గంటల 50 నిమిషాలకు హైదరాబాద్‌ హౌస్‌లో ప్రారంభమయ్యే ఇండియా-రష్యా 23వ శిఖరాగ్ర సమావేశంలో పుతిన్-మోడీ పాల్గొననున్నారు.

రెండు గంటలపాటు సాగే ఈ సమావేశంలో.. ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, ఇరుదేశాల వాణిజ్యం కాపాడడం, పౌర అణు ఇంధన సహకారం, ఎరువుల రంగంలో సహకారం పెంపు, యురేషియన్ ఎకనమిక్ యూనియన్‌‌తో భారత్ రూపొందించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సహా పలు కీలకంశాలు చర్చకు రానున్నాయి.

Tags:    

Similar News