Nirmala Sitharaman: రూపాయి పతనంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
Nirmala Sitharaman: భారత రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చారిత్రక కనిష్ఠ స్థాయిలకు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Nirmala Sitharaman: భారత రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చారిత్రక కనిష్ఠ స్థాయిలకు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి విలువ $1కి $90.70 - $91 మార్క్‌ను తాకనుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్న నేపథ్యంలో, రూపాయి పతనం పూర్తిగా ప్రతికూలమేమీ కాదని ఆమె స్పష్టం చేశారు.
హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "రూపాయి విలువ తగ్గడం ఎగుమతిదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎగుమతుల రంగం వృద్ధికి దోహదపడతాయి" అని వెల్లడించారు.
రూపాయి క్షీణత నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా దిగుమతులు మరియు ద్రవ్యోల్బణంపై పడే ప్రభావం గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఆర్థిక మంత్రి మాత్రం ఎగుమతి రంగంపై దాని సానుకూల ప్రభావాన్ని హైలైట్ చేశారు.