Tiger Cubs: వావ్.. పులి పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయో..!
Tiger Cubs: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా కేంద్రంలో పులిపిల్లల సంచారం కలకలం రేపుతోంది.
Tiger Cubs: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా కేంద్రంలో పులిపిల్లల సంచారం కలకలం రేపుతోంది. పవర్ ప్లాంట్ దగ్గర రెండు పులిపిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలు ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి. మార్నింగ్ వాక్ చేస్తుండగా.. అకస్మాత్తుగా రెండు పులిపిల్లలు తారసపడ్డాయి. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న మార్నింగ్ వాకర్స్.. ఆ పులిపిల్లల ఆటలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు. చంద్రపూర్ పట్టణానికి తడోబా అభయారణ్యం కూతవేటు దూరంలో ఉండటంతో తరచూ పులులు సంచరిస్తున్నట్టు తెలుస్తోంది.