Maharashtra: న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌కు ముందు రేవ్ పార్టీ భ‌గ్నం.. 100 మంది అరెస్ట్

Maharashtra: లేట్ నైట్ ఆపరేషన్‌లో బట్టబయలైన రేవ్ పార్టీ బాగోతం

Update: 2023-12-31 08:52 GMT

Maharashtra: న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌కు ముందు రేవ్ పార్టీ భ‌గ్నం.. 100 మంది అరెస్ట్

Maharashtra: మహారాష్ట్రలోని థానేలో రేవ్‌ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకలకు ముందు రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలపై థానేలో వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. థానే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ చేపట్టిన లేట్ నైట్ ఆపరేషన్‌లో రేవ్ పార్టీ బాగోతం బయటపడింది. ఘటనా స‌్థలంలో పలు మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకానికి సంబంధించి..అదుపులోకి తీసుకున్నరవారందరికీ మెడికల్ టెస్టులు నిర్వహించేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

Tags:    

Similar News