భారత్ బంద్ ‎‎కు దేశవ్యాప్తంగా మద్దతు

రైతు సంఘాలు చేపట్టనున్న భారత్ బంద్ కు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ప్రభుత్వంతో ఇప్పటికే మూడు సార్లు చర్చలు జరపగా, ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో మంగళవారంనాడు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.

Update: 2020-12-07 06:45 GMT

రైతు సంఘాలు చేపట్టనున్న భారత్ బంద్ కు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ప్రభుత్వంతో ఇప్పటికే మూడు సార్లు చర్చలు జరపగా, ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో మంగళవారంనాడు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.

విపక్షాలన్నీ బంద్‌కు తమ మద్దతు ప్రకటించాయి. లారీల యజమానులు, పది ప్రధాన కార్మిక సంఘాలు, అనేక ఇతర యూనియన్లు మద్దతు పలకగా, బ్యాంకు యూనియన్లు కూడా తమ గళం కలిపాయి. అటు బాలీవుడ్‌ తారలు ప్రియాంక చోప్రా, సోనమ్‌ కపూర్‌లతో పాటు పంజాబ్‌ నుంచి ఎన్నికైన సన్నీ డియోల్ కూడా మద్దతిచ్చారు.

చట్టాల్ని రద్దు చేయకుంటే ప్రభుత్వం తనకు ఇచ్చిన అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్నను వాపస్‌ ఇచ్చేస్తానని బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ప్రకటించారు. పరిస్థితిపై నేడు కేంద్ర వ్యవసాయ, హోం శాఖలు చర్చలు జరపనున్నాయి.

Tags:    

Similar News