కోవిడ్ పరిస్థితులపై దేశవ్యాప్తంగా హైఅలర్ట్.. రానున్న 40 రోజులు..

Corona: 2 రోజుల్లో దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో 39 మంది.. అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్

Update: 2022-12-28 11:21 GMT

కోవిడ్ పరిస్థితులపై దేశవ్యాప్తంగా హైఅలర్ట్

Corona: కోవిడ్ పరిస్థితులపై దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. రానున్న 40 రోజులు కీలకమంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‎సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీచేశారు. జనవరి నెలలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత 2 రోజుల్లో దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్ సోకిందన్నారు. మునుపటి ట్రెండ్‌ల ప్రకారం జనవరి మధ్యలో దేశంలో COVID-19 కేసుల పెరుగుదల కనిపించవచ్చన్నారు. అందువల్ల రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు.

Tags:    

Similar News