Narendra Modi: విపక్షాలపై ప్రధాని మోడీ డైరెక్ట్ అటాక్.. అవినీతిపరులను కాపాడే ఉద్యమం చేస్తున్నారు
Narendra Modi: ప్రతిపక్షాలకు భయపడేది లేదు
Narendra Modi: విపక్షాలపై ప్రధాని మోడీ డైరెక్ట్ అటాక్.. అవినీతిపరులను కాపాడే ఉద్యమం చేస్తున్నారు
Narendra Modi: ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ డైరెక్ట్ అటాక్ చేశారు. దేశంలో విపక్షాలు భ్రష్టాచార బచావో అభియాన్ నడుపుతున్నాయని ఫైర్ అయ్యారు. అవినీతిపరులను కాపాడే ఉద్యమం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం అనుబంధ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రతిపక్షాలకు భయపడేది లేదు, అవినీతిపై పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2014 మధ్య PMLA కేసుల్లో కేవలం 5వేల కోట్ల రూపాయల ఆస్తులను మాత్రమే జప్తు చేశారని.. అదే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 ఏళ్లలోనే PMLA కేసుల్లో లక్షా 10 వేల కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేశామని వివరించారు.