Nagarjuna Sagar Exit Poll: నాగార్జున సాగర్‌ ఎగ్జిట్‌పోల్స్‌లో టీఆర్‌ఎస్‌దే హవా

Nagarjuna Sagar Exit Poll: నాగార్జున సాగర్‌ బైపోల్‌లో, అధికార టీఆర్ఎస్‌దే విజయమని జోస్యం చెప్పాయి పలు సంస్థల ఎగ్జిట్‌పోల్స్.

Update: 2021-04-30 05:59 GMT

Nagarjuna Sagar Exit Poll: నాగార్జున సాగర్‌ ఎగ్జిట్‌పోల్స్‌లో టీఆర్‌ఎస్‌దే హవా

Nagarjuna Sagar Exit Poll: నాగార్జున సాగర్‌ బైపోల్‌లో, అధికార టీఆర్ఎస్‌దే విజయమని జోస్యం చెప్పాయి పలు సంస్థల ఎగ్జిట్‌పోల్స్. గులాబీ అభ్యర్థిదే విజయమని తేల్చాయి. కాంగ్రెస్‌కు రెండోస్థానం, బీజేపీకి మూడోస్థానమని అభిప్రాయపడ్డాయి.

తెలంగాణలో హైఓల్టేజ్ క్రియేట్ చేసిన బైపోల్, నాగార్జున సాగర్‌. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి. ఎవరు గెలుస్తారు ఫలితాలు ఎప్పుడెప్పుడా అన్న ఉత్కంఠ రోజురోజకు పెరిగింది. కొన్ని సర్వే సంస్థలు, బైపోల్ ఫలితంపై కొన్ని అంచనాలు ప్రకటించాయి. మిషన్ చాణక్య, ఆరా సంస్థలు తమ సర్వే ఫలితాలు వెల్లడించాయి.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్‌దే విజయమని మిషన్ చాణక్య, ఆరా సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌‌ వెల్లడించాయి. 49.24 శాతం ఓట్లతో గులాబీ పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధిస్తారని అభిప్రాయపడింది. ఇక 37.92 ఓట్ల శాతంతో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానంలో నిలుస్తారని అంచనా వేశాయి సర్వే సంస్థలు. బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోకతప్పదని, దాని ఓట్ల శాతం కేవలం 7.80 శాతమని వెల్లడించాయి. స్వతంత్రుల అభ్యర్థుల ఓటింగ్ 5.04 శాతమని తెలిపింది మిషన్ చాణక్య.

ఇక ఆరా సర్వే కూడా సాగర్‌లో టీఆర్ఎస్‌‌కే ఓటేసింది. 50.48 శాతం ఓట్లతో గులాబీ అభ్యర్థి విజయం ఖాయమని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 39.93 శాతం ఓట్లని అభిప్రాయపడింది. బీజేపీకి ఆరా ఇచ్చిన ఓట్లు కేవలం 6.31 శాతం. స్వతంత్రుల ఓట్ల శాతం 3.28. మొత్తానికి సాగర్‌ సమరంలో గులాబీ దండుదే విజయమని తేల్చాయి ఎగ్జిట్‌పోల్స్. మే 2న అసలైన ఫలితం రాబోతోంది.

Tags:    

Similar News