Jammu Kashmir Health Crisis: జమ్మూ కాశ్మీర్ లో వింత వ్యాధి? నెలరోజుల్లో 15 మంది మృతి

Update: 2025-01-17 00:49 GMT

 Jammu Kashmir Health Crisis: జమ్మూకశ్మీర్ లో ఏం జరుగుతోంది? ప్రజలు ఎందుకు మరణిస్తున్నారు? వారిని బాధిస్తున్న వ్యాధి ఏంటి? లక్షణాలు ఎలా ఉన్నాయి? ఈ వ్యాధిని వైద్యులు గుర్తించలేకపోతున్నారా? ఈ రహస్యం బయటపడేదేలా?

కోవిడ్ ప్రపంచాన్ని గడగడలాండించిన తర్వాత ఎన్నో రకాల వ్యాధులు పట్టిపీడుస్తున్నాయి. తాజాగా చైనాలో హెచ్ఎంపీవీ పై జోరుగా వార్తలు వస్తున్న క్రమంలో జమ్మూ కాశ్మీర్ లో మరో వింత వ్యాధి భయబ్రాంతులకు గురిచేస్తుంది. నెల వ్యవధిలోనే అక్కడ 15 మంది ఈ వింత వ్యాధితో మరణించారు. అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. తొమ్మిదేళ్ల బాలిక బుధవారం (జనవరి 15) జమ్మూలోని ఆసుపత్రిలో మరణించింది. దీంతో జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా బాదల్ గ్రామంలో అనుమానాస్పద మృతి చెందిన వారి సంఖ్య 15కి చేరింది. ఈ కేసులో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి మరణాలకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. గత నెలన్నరలో ఈ మరణాల సంఖ్య ఆందోళనకరంగా పెరగడంతో స్థానిక యంత్రాంగం దీనిపై తక్షణ చర్యలు చేపట్టడం ప్రారంభించింది.

జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య మంత్రి సకీనా మసూద్, బాదల్ గ్రామంలో ఈ మరణాల వెనుక ఏదో ఒక మర్మమైన వ్యాధి ఉండవచ్చు అంటు వస్తున్న వార్తలను ఖండించారు. విచారణ సందర్భంగా వివిధ ల్యాబొరేటరీలకు శాంపిల్స్ పంపామని, అయితే ఎలాంటి వ్యాధి నిర్ధారణ కాలేదని మంత్రి తెలిపారు. బాదల్ గ్రామంలో మూడు సంబంధిత కుటుంబాల్లో మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందని, అయితే ఈ మరణాలు వ్యాధి కారణంగా సంభవించడం లేదని స్పష్టం చేశారు.

అయితే ఇప్పటి వరకు అధికారులు ఏం తేల్చారంటే మరణించినవారంతా 3 కుటుంబాలకు చెందినవారే. అందరికీ బంధుత్వాలు ఉన్నాయి. వారిలో ముందుగా వాంతులు, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే లక్షణాలు కనిపంచాయి. అయితే ఇదేమీ వింత వ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇది ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోతుంది. ఇంత మంది మరణిస్తే తేలిగ్గా తీసుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దీనిపై ప్రత్యేక సిట్ ను వేసింది.

పుణెలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DRDO) సహా జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల నుండి ప్రభుత్వం సహాయం తీసుకుందని ఆరోగ్య మంత్రి తెలిపారు. గ్వాలియర్, PGI ఉన్నాయి. ఈ పరిశోధనలలో దేనిలోనూ ప్రతికూల ఫలితాలు వెలువడలేదు. నీరు, ఆహార పదార్థాల నమూనాలను కూడా పరీక్షించారు, అయితే విషపూరిత పదార్థం గుర్తించలేదు.

అధికారుల సమాచారం ప్రకారం చనిపోయినవారి నమూనాలలో 'న్యూరోటాక్సిన్' గుర్తించినట్లు కొందరు ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి సకీనా మసూద్ మాట్లాడుతూ.. తుది నిర్ధారణకు వచ్చేలోపు మొత్తం విచారణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. జిల్లా డెవలప్‌మెంట్ కమీషనర్చ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నానని, ఈ విషయంలో నిజానిజాలు బయటకు తీసుకురావడానికి సమగ్ర విచారణ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

Tags:    

Similar News