Prajwal Revanna: ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రజ్వల్ రేవణ్ణ
Prajwal Revanna: కర్ణాటక సెక్స్ స్కాండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌కి దరఖాస్తు చేసుకున్నారు.
Prajwal Revanna: ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రజ్వల్ రేవణ్ణ
Prajwal Revanna: కర్ణాటక సెక్స్ స్కాండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌కి దరఖాస్తు చేసుకున్నారు. మే 31న సిట్ విచారణకు హాజరవుతానని రెండ్రోజుల క్రితం వీడియో విడుదల చేసిన ప్రజ్వల్... తాజాగా బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కాడు. సిట్ విచారణ కోసం జర్మనీ నుంచి బెంగళూర్‌కి టికెట్ సైతం బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసును విచారిస్తున్న సిట్ బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో ప్రజ్వల్ కోసం నిఘా పెట్టింది. ఎయిర్‌పోర్టులో ప్రజ్వల్ ల్యాండ్ కాగానే అతడిని అరెస్ట్ చేస్తామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఓ వైపు సిట్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ బెంగళూరు సెషన్స్ కోర్టుకు వెళ్లాడు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.