Ayodhya Ram Temple Trust receives Huge Donation: అయోధ్య రామమందిర నిర్మాణానికి భారీ విరాళం

Ayodhya Ram Temple Trust receives Huge Donation: ఎన్నో ఏండ్లుగా వివాదాస్ప‌దంగా ఉన్న అయోధ్య స్థల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పుతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

Update: 2020-07-28 08:21 GMT
morari-bapu

Ayodhya Ram Temple Trust receives Huge Donation: ఎన్నో ఏండ్లుగా వివాదాస్ప‌దంగా ఉన్న అయోధ్య స్థల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పుతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సుప్రీం తీర్పుతో రామాల‌యం నిర్మాణానికి మార్గం సుగ‌మమైంది.అయోధ్య రామాల‌య‌ భూమిపూజ కార్యక్రమానికి ఏర్పాట్లు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఆలయ నిర్మాణానికి భారీ ఎత్తున విరాళాలు కూడా వస్తున్నాయి. రామ మందిర నిర్మాణానికి పలువురు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు రూ.5కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలోని వ్యాస్‌పీఠ్‌ నుంచి శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్ కు విరాళాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. పట్నాలోని మహవీర్‌ మందిర్‌ ట్రస్టు రూ.10కోట్ల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా అయోధ్య రామాల‌య ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 5 న రామాలయానికి పునాది రాయి వేయనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ త‌దిత‌రులు పాల్గొన‌నున్నారు. వెండి ఇటుకతో ప్రధాని రామాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. కాశీ నుంచి వచ్చే ఐదుగురు పురోహితులు భూమి పూజ నిర్వహించనున్నారు. మరోవైపు అయోధ్యలో నిర్మించనున్న రామమందిరానికి బంగారు ఇటుకను గిఫ్ట్ గా ఇస్తానని మొగల్ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ ప్రకటించారు. కేజీ బరువున్న బంగారు ఇటుకను ప్రధానికి అందిస్తానని, దానిని మందిర నిర్మాణంలో వాడవచ్చని తెలిపారు

Tags:    

Similar News