Jharkhand: అకస్మాత్తుగా వచ్చిపడ్డ వరద.. నదిలో చిక్కుకున్న స్కార్పియో

రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి.

Update: 2020-06-22 06:39 GMT

రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత కొద్దీ రోజులుగా జార్ఖండ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని చత్ర జిల్లా ప్రతాపూర్ బ్లాక్‌లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురవడం వలన బంజాభర్ నది నీటి మట్టం పెరిగింది. నీరు క్రమంగా పెరిగి రహదారులమీద ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఒక స్కార్పియో ఈ నదిని దాటుతుండగా నది ఉదృతి ఒక్కసారిగా పెరగడంతో.. స్కార్పియోలో ఉన్న నలుగురు వ్యక్తులు కారును నది మధ్యలోనే ఆపి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. అయితే వరద వృదృతి తగ్గడానికి చాలా సమయం పట్టింది. ఆ తరువాత అతి కష్టం మీద స్కార్పియోను నది నుండి బయటకు తీశారు.

స్కార్పియో డ్రైవర్ చెప్పినదాని ప్రకారం నదిలో తక్కువ నీరు చూసి, దాటవచ్చని అనుకున్నామని.. కాని అకస్మాత్తుగా నది ప్రవాహం భారీగా పెరిగింది.. దాంతో ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అందువల్లే అందరూ దిగి నదినుంచి ప్రాణాలు రక్షించుకున్నామన్నారు. కాగా తామంతా జోరిలోని కాళి ఆలయంలో జరిగిన వివాహ వేడుకకు వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని అన్నారు. కాగా 2019 లో భారీ వర్షాలతో బంజాభర్ నదిపై వంతెన దెబ్బతింది. అయితే వంతెనను పరిశీలించిన అధికారులు.. రిపేరు పనులు మాత్రం మొదలుపెట్టలేదు.


Tags:    

Similar News