కాల్వలో పడిన స్కార్పియో వెలికితీత..కారులోనే ఆరు మృతదేహాల గుర్తింపు

Arun Chilukuri
Updated on: 19 Oct 2019 3:42 PM IST
కాల్వలో పడిన స్కార్పియో వెలికితీత..కారులోనే ఆరు మృతదేహాల గుర్తింపు
X

సూర్యపేట జిల్లా చాకిరాల దగ్గర నాగార్జున సాగర్ కాల్వలో బోల్తా పడిన స్కార్పియోను NDRF సిబ్బంది వెలికితీశారు. గల్లంతైన ఆరుగురు కారులోనే మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. క్రేన్ సాయంతో వాహనాన్ని బయటకు తీసిన సిబ్బంది లోపలున్న మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డోర్లు లాక్ అయినట్టు భావిస్తున్నారు. ఒకే సారి ఆరుగురు మృతి చెందడంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story