కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
x
Highlights

నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్నీ భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా చెప్పారు.

నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్నీ భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా చెప్పారు. నైరుతి రుతుపవనాలు కేరళ తీరం ద్వారా భారత్ లోకి ప్రవేశించాయని స్పష్టం చేశారు. కాగా దేశంలో వ్యవసాయ-ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంచే నైరుతి రుతుపవనాల కాలం, మొదట కేరళ యొక్క దక్షిణ కొనను సాధారణంగా జూన్ మొదటి వారంలో తాకి, సెప్టెంబర్ నాటికి రాజస్థాన్ నుండి తిరోగమనం చెందుతాయి. ఇక వాతావరణ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం జూన్ నుండి సెప్టెంబర్ వరకు దేశంలో 75 శాతం వర్షపాతం నమోదు కానుంది.

వాస్తవానికి శనివారం, ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ రుతుపవనాల రాకను ప్రకటించింది, అయితే ఈ వార్తతో భారత వాతావరణ శాఖ విభేదించింది, రుతుపవనాలు కేరళ తీరాన్ని ఇంకా తాకలేదని వెల్లడించింది. ఇదిలావుంటే ఈసారి రుతుపవనాలు సగటున ఉండబోతున్నాయని వాతావరణ శాఖ ఏప్రిల్‌లో తెలిపింది. ఈసారి 96 నుండి 100% వర్షపాతం నమోదైతే సాధారణ రుతుపవనాలుగా పరిగణించబడుతుంది. గతేడాది ఎనిమిది రోజుల ఆలస్యంతో జూన్ 8 న కేరళ తీరాన్ని తాకాయి.. జూన్ , సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల ద్వారా భారతదేశంలో వర్షాలు కురుస్తాయి.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories