వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

ప్రజా ఆస్తుల విధ్వంసానికి పాల్పడకుండా వాటి పరిరక్షణకు ప్రజలంతా కంకణబద్ధులు కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

Update: 2019-12-25 15:07 GMT
vajpayee statue

ప్రజా ఆస్తుల విధ్వంసానికి పాల్పడకుండా వాటి పరిరక్షణకు ప్రజలంతా కంకణబద్ధులు కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. లోక్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీమాట్లాడుతూ, సీఏఏపై ప్రజలు ఎలాంటి వందతులు నమ్మరాదని అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. తాము చేస్తున్నది తప్పో.. ఒప్పో నిరసనకారులు పరిశీలించుకోవాలని విఙ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో బతకడం ప్రతీ పౌరుడి హక్కు అని.. అయితే ఆ క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రజా ఆస్తుల విధ్వంసానికి పాల్పడకుండా వాటి పరిరక్షణకు ప్రజలంతా కంకణబద్ధులు కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

అంతకు ముందు మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి నిలువెత్తు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. లక్నోలోని లోక్ ‌భవన్ వద్ద ఏర్పాటు చేసిన 25 అడుగుల వాజ్‌పేయి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి మెడికల్ యూనివర్శిటీకి సైతం ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. యూనివర్శిటీ ఏర్పాటు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 50 ఎకరాల భూమిని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్‌పేయి సేవలను మోడీ గుర్తు చేసుకున్నారు. అటల్ స్ఫూర్తిగా ముందుకు సాగుతామన్నారు.

Tags:    

Similar News