Uttar Pradesh: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100స్థానాల్లో ఎంఐఎం పోటీ
Uttar Pradesh: Uttar Pradesh: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేస్తామన్నారు ఎంఐఎం అధినేత
అసదుద్దీన్ ఒవైసి (ఫైల్ ఇమేజ్)
Uttar Pradesh: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేస్తామన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. లక్నోలో ఉన్న తమ పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఓవైసీ ప్రకటించారు. ఎన్నికల్లో పొత్తు కోసం ఒకటి రెండు పార్టీలతో చర్చలు జరుపుతున్నామని, అయితే స్థానిక పార్టీలతో పొత్తు ఉంటుందా లేదా అన్నది కాలమే చెబుతుందని వ్యాఖ్యానించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచే పరిస్థితిలో ఉందని ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు.