Ayodhya: అయోధ్య బాలరాముడి దర్శనానికి.. పోటెత్తిన భక్తులు

Ayodhya: భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయం వద్ద తోపులాట

Update: 2024-01-24 03:59 GMT

Ayodhya: అయోధ్య బాలరాముడి దర్శనానికి.. పోటెత్తిన భక్తులు

Ayodhya: అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రామయ్య దర్శనభాగ్యం కల్పించారు. అయితే వేకువజామునే ఆలయం వద్దకు లక్షలాది మంది తరలివచ్చారు. ప్రధాన మార్గమైన రామ్‌పథ్‌ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఉదయం 6 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలోకి భక్తులను అనుమతించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వారిని నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఆలయం వద్ద పెద్ద క్యూలు దర్శనమిచ్చాయి. కొంత మంది భక్తులు పోలీసు లైన్లను కూడా దాటుకొంటూ వెళ్లారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయం వద్ద తోపులాట జరిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి దాదాపు 2.5 లక్షల మంది ఆలయానికి వచ్చారని అయోధ్య డివిజనల్‌ కమిషనర్‌ గౌరవ్‌ దయాల్‌ తెలిపారు. తొలి రోజు దాదాపు 5 లక్షల మంది రాములోరిని దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News