Vadodara: కోవిడ్‌ ఆస్పత్రిగా మసీదు.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే..

Vadodara: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులతో ఆస్పత్రులు సరిపోవడంలేదు.

Update: 2021-04-20 16:15 GMT

Vadodara: కోవిడ్‌ ఆస్పత్రిగా మసీదు.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే..

Vadodara: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులతో ఆస్పత్రులు సరిపోవడంలేదు. బెడ్లు దొరక్క బాధితులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని వడోదర నగరంలో ఒక మసీదు నిర్వాహకులు స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నారు. మసీదును కోవిడ్ సెంటర్‌గా మార్చివేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మసీదును మించిన సదుపాయాలు ఎక్కడా ఉండవని మసీదు నిర్వాహకులు ఇర్ఫాన్ షేక్ చెప్పారు. కరోనా కష్టకాలం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనికి మద్దతుగా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితి తీవ్రతను గుర్తించినందునే మసీదుకు కోవిడ్ సెంటర్‌గా మార్చామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News