Maoists: ఆయుధాలు వదిలేస్తాం.. ఫిబ్రవరి వరకు సమయమివ్వండి: మావోయిస్టుల లేఖ!
Maoists: ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ (MMC) రాష్ట్రాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లను నిలిపివేస్తే, తాము ఆయుధాలు విడిచిపెట్టే తేదీని ప్రకటిస్తామని మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు.
Maoists: ఆయుధాలు వదిలేస్తాం.. ఫిబ్రవరి వరకు సమయమివ్వండి: మావోయిస్టుల లేఖ!
Maoists: ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ (MMC) రాష్ట్రాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లను నిలిపివేస్తే, తాము ఆయుధాలు విడిచిపెట్టే తేదీని ప్రకటిస్తామని మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు వారు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. MMC స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరుతో విడుదల చేసిన ఒక బహిరంగ లేఖలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఆయుధాలు త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని ఈ లేఖలో మావోయిస్టులు తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యులు సతీశ్ దాదా మరియు చంద్రన్న కూడా ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారని పేర్కొన్నారు.
MMC స్పెషల్ జోనల్ కమిటీ సైతం తుపాకులను వదిలివేయాలని భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని సమష్టిగా, పద్ధతి ప్రకారం తమ సహచరులకు తెలియజేయడానికి కొంత సమయం అవసరం. కమ్యూనికేషన్ కోసం వేరే సులభ మార్గాలు లేనందున, మూడు రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఫిబ్రవరి 15 వరకు గడువు ఇవ్వాలని వారు అభ్యర్థించారు.
ఆయుధాలు విడిచిపెట్టే తేదీని ప్రకటించేందుకు, ప్రభుత్వాలు వెంటనే భద్రతా బలగాల కార్యకలాపాలను నిలిపివేయాలని మావోయిస్టులు కోరారు. ప్రతిగా, తాము పీఎల్‌జీఏ వారోత్సవాన్ని నిర్వహించబోమని, అలాగే తమ అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని లేఖలో హామీ ఇచ్చారు.