ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రధాని మోడీపై నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం..

Delhi: ఒక్కరోజే ప్రత్యేకంగా సమావేశమైన ఢిల్లీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు.

Update: 2022-08-26 15:00 GMT

ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రధాని మోడీపై నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం..

Delhi: ఒక్కరోజే ప్రత్యేకంగా సమావేశమైన ఢిల్లీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. కేజ్రీవాల్ సర్కార్ విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలపై ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయని, అయితే మోడీ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ ఆధారాల్లేని అభియోగం మోపిందని కౌంటర్ ఎటాక్ చేశారు. సీబీఐ అధికారులు గంటల తరబడి తన ఇంట్లో సోదాలు జరిపారని చెప్పారు. తన డ్రెస్‌లతో పాటు పిల్లల డ్రెస్‌లను కూడా తనిఖీలు చేశారని వెల్లడించారు. అయితే సోదాల్లో ఏవీ కనిపించలేదన్నారు.

కేజ్రీవాల్ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ పన్నిన కుట్ర భాగంగానే ఈ సోదాలు జరిగాయని సిసోడియా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ సీరియల్ కిల్లర్‌గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రూల్ 280 కింద ప్రశ్నలు స్వీకరించని డిప్యూటీ స్పీకర్ నిర్ణయంపై బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఆప్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగి సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను కొద్దిసేపు వాయిదా పడింది. అయినా బీజేపీ నిరసన ఆపకపోవడంతో వారిని సభ నుంచి బయటకు పంపివేశారు. 

Tags:    

Similar News