Doctor: ఈ నకిలీ డాక్టర్ 15మంది ప్రాణాలు తీశాడు.. ఈ కథ తెలుసుకుంటే ఆవేశం ఆగదు!
Doctor: ఒక్క వ్యక్తి మోసం వల్ల చాలామంది ప్రాణాలు పోయాయి. ఆరోగ్యంపై మన ప్రాణాలే ఆధారపడే సమయంలో ఇటువంటి మోసాలు దేశ వ్యాప్తంగా కలవరపెడుతున్నాయి.
Doctor: ఈ నకిలీ డాక్టర్ 15మంది ప్రాణాలు తీశాడు.. ఈ కథ తెలుసుకుంటే ఆవేశం ఆగదు!
Doctor: మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఓ హృదయాన్ని కలచివేసే ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. లండన్‌కు చెందిన కార్డియోలజిస్టుగా నటించిన ఒక వ్యక్తి, అక్కడి మిషనరీ హాస్పిటల్‌లో 15 మంది రోగులపై గుండె శస్త్రచికిత్సలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ శస్త్రచికిత్సల ఫలితంగా ఏడుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది.
దమోహ్‌కు చెందిన దీపక్ తివారి అనే వ్యక్తి ఈ కేసును వెలుగులోకి తెచ్చాడు. అతని ఆరోపణల ప్రకారం, గత జనవరి, ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరిన రోగులపై శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ పేరు 'ఎన్ జాన్ కేమ్'గా చెప్పబడింది. ఇతను లండన్‌కు చెందిన ప్రఖ్యాత హృదయ వైద్యుడినని చెప్పి 15 మంది రోగులపై శస్త్రచికిత్సలు చేశాడు. అయితే తర్వాత విచారణలో ఆ డాక్టర్ అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని తేలింది. నిజానికి ఎన్ జాన్ కేమ్ అనే డాక్టర్ జార్జ్ యూనివర్సిటీకి చెందిన అసలైన గుండె నిపుణుడు. నరేంద్ర అతని పేరును దుర్వినియోగం చేసి ఫేక్ డిగ్రీలు చూపిస్తూ దేశంలో కార్డియోలజిస్టుగా చెలామణీ అయ్యాడు. ఈ విషయం వెలుగు చూసిన తర్వాత అసలైన డాక్టర్ జాన్ కేమ్ ఒక ఈమెయిల్ ద్వారా తానే బాధితుడిని అంటూ ధృవీకరించాడు.
తివారి చేసిన ఫిర్యాదులో ఆసుపత్రి మరణాల వివరాలను పోలీసులకు లేదా హాస్పిటల్ అవుట్‌పోస్టుకు తెలియజేయలేదని ఆరోపించారు. పైగా మృతుల కుటుంబాలను దారి తప్పించి, భారీగా చార్జీలు వసూలు చేసి, పోస్టుమార్టం లేకుండానే మృతదేహాలను అప్పగించారని చెప్పారు.
దీంతో తివారి.. ఆసుపత్రిలో జరిగిన మరణాలకు సంబంధించి న్యాయ విచారణ జరపాలని, నకిలీ డాక్టర్‌పై హత్యారోపణలు పెట్టాలని, ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవలే జిల్లా కలెక్టర్ సుధీర్ కొచ్చర్ ఈ ఫిర్యాదు తమకు అందినట్టు నిర్ధారించారు. ప్రస్తుతం పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఇలాంటి ఘటనలు ప్రజలలో వైద్య రంగంపై నమ్మకాన్ని దెబ్బతీసేలా మారుతున్నాయి. ఒక్క వ్యక్తి మోసం వల్ల చాలామంది ప్రాణాలు పోయాయి. ఆరోగ్యంపై మన ప్రాణాలే ఆధారపడే సమయంలో ఇటువంటి మోసాలు దేశ వ్యాప్తంగా కలవరపెడుతున్నాయి.