Mamata : 2024లో ఎన్నికలు వస్తే అవి మోడీకి దేశానికి మధ్యే జరుగుతాయి

* కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో మమతా బెనర్జీ సమావేశం * బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేపనిలో మమతా బెనర్జీ

Update: 2021-07-29 02:13 GMT

మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

Delhi: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. మొన్న ప్రధాని సహా కీలక నేతలతో భేటీ అయిన దీదీ నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌ గాంధీలతో సమావేశమయ్యారు. గత కొంత కాలంగా థర్డ్‌ఫ్రంట్ అంశంపై వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో మమత ఢిల్లీ టూర్ ఆసక్తిరేపుతోంది. సోనియాతో భేటీ సందర్భంగా మమతా బెనర్జీ కూటమి అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేపనిలో ఉన్న దీదీ సోనియాతో భేటీ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో ఎన్నికలు వస్తే అవి మోడీకి దేశానికి మధ్యే జరుగుతాయన్నారు. అలాగే, విపక్ష కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారన్న దానిపై అప్పటి పరిస్థితిని బట్టే నిర్ణయం ఉంటుందన్నారు. లీడర్ ఎవరన్నది ముందే చెప్పేందుకు తానేమీ రాజకీయ జ్యోతిష్కురాలిని కాదని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News