Mamata Banerjee: సర్కారు ఆస్పత్రులకొస్తే... సకాలంలో వైద్యసేవలు అందివ్వాలి

* కాన్పుకోసం వచ్చినా... రెఫర్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి

Update: 2022-11-22 01:11 GMT

సర్కారు ఆస్పత్రులకొస్తే... సకాలంలో వైద్యసేవలు అందివ్వాలి

Mamata Banerjee: అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి వచ్చే రోగులను పొరుగు ప్రాంతాలకు చెందిన ఆస్పత్రులకు రెఫర్ చేసే విధానాన్ని మానుకోవాలని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. కోల్‌కతాలో ఆమె వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఇటీవల వెస్ట్ బెంగాల్‌లో రెఫర్ చేసిన వారిలో అత్యధికులు సకాలంలో సరైన ట్రీట్మెంట్ లేకుండా ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డాక్టర్లు రెఫర్ చేసే సంస్కృతిని పూర్తిగా మాపుచేయాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి నిగమ్‌‌ను ఆదేశించారు. పురిటినొప్పులతో సర్కారు ఆస్పత్రులకొస్తే కాన్పు చేయకుండా రెఫర్ చేయడమేంటిని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అధికారులను ప్రశ్నించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యసేవలు అందించకుండా రెఫర్ చేసే వారిని గుర్తించి కఠినంగా శిక్షించేందుకు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించకుండా పొరుగు ప్రాంత ఆస్పత్రులకు రెఫర్ చేస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. 

Tags:    

Similar News