అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వంకు వరుస ఎదురుదెబ్బలు
AIADMK: ఒకవైపు చేజారిన నాయకత్వం.. మరోవైపు అనుచరుల్లో అసంతృప్తితో అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వంకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు.
అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వంకు వరుస ఎదురుదెబ్బలు
AIADMK: ఒకవైపు చేజారిన నాయకత్వం.. మరోవైపు అనుచరుల్లో అసంతృప్తితో అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వంకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. పార్టీ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికపై అటు మద్రాస్ హైకోర్టులోనూ, ఇటు సుప్రీంకోర్టులోనూ రెండు చోట్లా పన్నీర్ సెల్వంకు నిరాశే ఎదురైంది.
ద్వంద్వ నాయకత్వం రద్దు చేసినప్పటి నుంచి అన్నాడీఎంకేలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు చీలిపోయాయి. ఈ క్రమంలో ఈరోడు తూర్పు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలోనూ ఈ రెండు వర్గాల నుంచి నేతలు పోటీకి దిగారు. అయితే అన్నాడీఎంకే సెక్రటరీగా ఈపీఎస్ ఎన్నికను సుప్రీంకోర్టు సమర్థించడంతో పన్నీర్ సెల్వం వర్గం నుంచి పోటీ చేసిన అభ‌్యర్థి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు పార్టీకి సంబంధం లేని వ్యక్తి్ని అభ్యర్థిగా ప్రకటించారనే అసంతృప్తితో ఓపీఎస్ వర్గం నేత మురుగానందంతో పాటు మరో 106 మంది పన్నీర్ వర్గాన్ని వీడారు. ఇలా వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న పన్నీర్ సెల్వం భవిష్యత్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.