Dhananjay Munde: మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా

Dhananjay Munde: మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Update: 2025-03-04 06:37 GMT

Dhananjay Munde: మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా

Dhananjay Munde: మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీడ్ జిల్లాలో సర్పంచ్ దారుణ హత్యపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా సమర్పించారు. సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ హత్యపై మంత్రిపై ఆరోపణలు వచ్చాయి. ధనంజయ్ మొండే రాజీనామా లేఖను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు పంపారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.

నేషనల్ కాన్ఫరెన్స్ అజిత్ పవార్ పార్టీలో ధనంజయ్ మొండే కీలక నాయకుడు. మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ కిడ్నాప్, హత్య ఆరోపణలు మంత్రిపై వచ్చాయి. ఈ కేసులో మంత్రి సన్నిహితుడు వాల్మిక్ కరాడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి పదవికి మొండే రాజీనామా చేయడంతో బీడ్ జిల్లాలో ఇవాళ హై అలర్ట్ నెలకొంది. సర్పంచ్ ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు.

Tags:    

Similar News