Shivajirao Patil Nilangekar tests positive for Covid: మాజీ ముఖ్యమంత్రికి కరోనా.. ఆసుపత్రిలో చికిత్స

Shivajirao Patil Nilangekar tests positive for Covid: మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.

Update: 2020-07-16 13:15 GMT
Coronavirus Updates in Telangana:

Shivajirao Patil Nilangekar tests positive for Covid: మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి‌ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివాజీరావు పాటిల్ నీలంగేక‌ర్(88)‌ క‌రోనా భారిన పడ్డారని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఆయనను తన స్వస్థలం అయినను చికిత్స కోసం లాతూర్ జిల్లా నుంచి పుణెలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయని.. ఈ క్రమంలో కాస్త అసౌకర్యానికి గురైనట్లు కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే కరోనా లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెప్పడంతో ఆయనకు కరోనా పరీక్షలు చేశారు. బుధవారం అర్ధరాత్రి ఆయన నివేదిక పాజిటివ్ గా వచ్చింది. కాగా పాటిల్ శివాజీరావు పాటిల్ లాతూర్ జిల్లా నుంచి కరోనా భారిన పడిన రెండవ సీనియర్ రాజకీయ నాయకుడు అని తెలుస్తోంది.

అంతకుముందు బిజెపి ఎమ్మెల్యే అభిమన్యు పవార్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.. ప్రస్తుతం ఆయన లాతూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా శివాజీరావు 1985-86 మ‌ధ్య మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇక ఇప్ప‌టివ‌ర‌కు మ‌హారాష్ట్ర‌లో దేశంలోనే అత్య‌ధికంగా 2,75,640 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మరోవైపు పాటిల్ నీలంగేకర్ మనవడు సంభాజీ పాటిల్ బిజెపి ఎమ్మెల్యే గా ఉన్నారు.. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు.


Tags:    

Similar News