Viral Video: 4,000 మంది విద్యార్థులు, 5,000 దీపాలతో గణేశుడి అద్భుత రూపం.. వీడియో వైరల్

కర్ణాటక రాష్ట్రం, కొప్పళ జిల్లా గంగావతి తాలూకా శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినాయక చవితి వేడుకలను విభిన్నంగా జరిపి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుకలో 4,000 మంది విద్యార్థులు కలిసి గణేశుడి భారీ ఆకృతిని రూపొందించారు. దానిపై 5,000 దీపాలను వెలిగించి అద్భుత దృశ్యాన్ని సృష్టించారు.

Update: 2025-08-26 14:47 GMT

డ్రోన్ కెమెరాతో పై నుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించగా.. వెలుగుల కాంతిలో గణేశుడి రూపం మరింత అందంగా కనిపించింది. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు పర్యావరణహిత గణేశ విగ్రహాలను కూడా తయారు చేశారు.

పాఠశాల అధ్యక్షుడు నెక్కంటి సూరిబాబు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో పర్యావరణంపై అవగాహన పెంపొందించడమే కాకుండా, వారి సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యమని తెలిపారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వినూత్న వేడుకలో విద్యార్థుల సమిష్టి కృషి అందరినీ ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ అద్భుత దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News