లాక్‌డౌన్‌ పొడిగిస్తు కేంద్ర హోంశాఖ ప్రకటన

కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 3తో ముగియనుంది.

Update: 2020-05-01 13:23 GMT

కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మే 4 నుంచి మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దీంతో మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది.

ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా కట్టడి చర్యల కొనసాగింపుపై కీలక ప్రకటన చేయనున్నారు.

Tags:    

Similar News