Maharashtra: ఆసుపత్రిలో దూరిన చిరుత.. భయాందోళనకు గురైన రోగులు
Maharashtra: పులిని బంధించి తరలించిన అటవీశాఖ సిబ్బంది
Maharashtra: ఆసుపత్రిలో దూరిన చిరుత.. భయాందోళనకు గురైన రోగులు
Maharashtra: మహారాష్ట్రలో ఓ చిరుత కలకలం రేపింది. నందుర్‌బార్ జిల్లాలో చిరుతపులి ఆసుపత్రిలోకి ప్రవేశించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని షాహదా పట్టణంలోని డోంగర్‌గావ్ రోడ్డులోని ఆదిత్య ప్రసూతి కంటి ఆసుపత్రిలో చిరుతపులి కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న రోగుల బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని... వెంటనే ఆసుపత్రి రోగులను అప్రమత్తం చేశారు.
ఆసుపత్రి ఆవరణలో క్లీనింగ్ పనులు చేస్తుండగా.. పెద్ద శబ్దం రావడం గమనించారు అక్కడి కార్మికులు. చిరుతపులి ఓ మూలన కూర్చోవడం చూసి.. ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వెనుక తలుపు వేసి చిరుతను బంధించారు ఆస్పత్రి సిబ్బంది. ఆస్పత్రికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. పులిని బంధించి ఆసుపత్రి నుంచి బయటకు తీసుకువచ్చారు.