స్వాతి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఏ బిభవ్ అరెస్ట్
సీఎం కేజ్రీవాల్ నివాసంలో బిభవ్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
స్వాతి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఏ బిభవ్ అరెస్ట్
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ అరెస్ట్ అయ్యారు. తనను హింసించాడని పోలీసులకు స్వాతి మలివాల్ ఫిర్యాదు చేయగా.. ఈ కేసు రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ నివాసంలో బిభవ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బిభవ్‌కు మెడికల్ టెస్టులు చేస్తున్న పోలీసులు.. కాసేపట్లో ఆయన్ను తిజ్ హజారీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో బిభవ్ స్టేట్‌మెంట్ తీసుకోనున్నారు. మరోవైపు కొన్నాళ్లుగా బీజేపీ, ఆప్ మధ్య ఈ వివాదంపై మాటలయుద్ధం కొనసాగుతోంది. బిభవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ ఆరోపణలు చేస్తోంది ఆప్. ఎన్నికల ముందు ఆప్‌ను దెబ్బతీసేందుకే బీజేపీ స్వాతి ద్వారా కుట్ర చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.