Karnataka: కర్ణాటకలో కొనసాగుతున్న బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్స్
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కుర్చీ కోసం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్స్ ఇంకా జరుగుతున్నాయి.
Karnataka: కర్ణాటకలో కొనసాగుతున్న బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్స్
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కుర్చీ కోసం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్స్ ఇంకా జరుగుతున్నాయి. మూడురోజుల క్రితం సీఎం సిద్ధరామయ్య ఇంటికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెళ్లారు. తాజాగా.. ఇవాళ డీకే ఇంటికి సిద్ధరామయ్య రానున్నారు. బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ పేరిట వీరిద్దరూ మరోసారి సమావేశం కానున్నారు. పవర్ షేరింగ్‌పై చర్చించనున్నారు.
ఇద్దరి మధ్య విభేదాలు లేవంటూనే కుర్చీ కోసం కుస్తీ పడుతున్నారు. సీఎంగా తానే కొనసాగుతానని సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే పలుమార్లు తన మనసులో మాట చెప్పగా.. డీకేకు పగ్గాలు అప్పజెప్పాలంటూ అతడి వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో.. కర్ణాటకం సీరియల్‌కు ఇంక తెరపడలేదని అక్కడి రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది.