Karnataka: నేడు కర్ణాటక ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు
Karnataka: ఇవాళ కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక
Karnataka: నేడు కర్ణాటక ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశమౌతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ ఆర్‌వీ దేశ్‌పాండే ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించున్నారు. అనంతరం స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార వేడుకను నిర్వహించారు. సీఎం సిద్ధరామయ్యతో గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రిగా, మొత్తం 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.