Karnataka Results 2023: పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ గెలుపు..!

Karnataka Election Result 2023: కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.

Update: 2023-05-13 06:45 GMT

Karnataka Results 2023: పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ గెలుపు..!

Karnataka Election Result 2023: కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కనకపురా నుంచి బరిలోకి దిగిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు డీకే శివకుమార్‌. 70 శాతానికి పైగా ఓట్లతో ఆయన గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అశోక్, జేడీఎస్ నేత బి.నాగరాజులు తర్వాతి స్థానాలకు పరిమితమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు 12 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ మూడు, జేడీఎస్‌లు ఒక్క స్థానంలో గెలుపొందాయి. ఇక కాంగ్రెస్‌ 110, బీజేపీ 65, జేడీఎస్‌ 25, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Tags:    

Similar News