ఢిల్లీకి కర్ణాటక పంచాయితీ.. సిద్ధరామయ్య,డీకే శివకుమార్ కు అధిష్టానం నుంచి నుంచి పిలుపు..?

Karnataka Congress Crisis: కర్ణాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది.

Update: 2025-11-28 06:03 GMT

ఢిల్లీకి కర్ణాటక పంచాయితీ.. సిద్ధరామయ్య,డీకే శివకుమార్ కు అధిష్టానం నుంచి నుంచి పిలుపు..?

Karnataka Congress Crisis: కర్ణాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. నాయకత్వ మార్పుపై ఇప్పటి వరకు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య సాగిన రగడ తాజాగా హస్తినకు చేరుకుంది. కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. గడిచిన వారం రోజులుగా సిద్దరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ జరుపుతున్నాయి.

డీకేకు పదోన్నతి కోరుతూ ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ నాయకత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో హస్తిన నుంచి పిలుపు రావడంపై ఉత్కంఠగా మారింది. మరో వైపునాయకత్వ మార్పు ఊహాగానాల మధ్య హైకమాండ్ ఒక వ్యక్తి కాదు..ఒక టీం అని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. రాహుల్ సమక్షంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తోపాటు సీనియర్ మంత్రులతోనూ చర్చలు జరపనున్నారు.

Tags:    

Similar News