DK Shiva Kumar: కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన డీకె శివకుమార్

DK Shiva Kumar: శివకుమార్ భుజంపై చేయివేసేందుకు యత్నించిన కార్యకర్త

Update: 2021-07-10 12:59 GMT

కార్యకర్త చెంపపై కొట్టిన డీకే శివ కుమార్ (ఫోటో ఇండియా టుడే)

DK Shiva Kumar: కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు కోపమొచ్చింది. నడుస్తూ నడుస్తూనే ఓ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి జి.మడెగౌడ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసేందుకు శివకుమార్ మాండ్య వెళ్లారు. ఆ సమయంలో ఓ కార్యకర్త శివకుమార్‌పై చేయి వేసేందుకు యత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్త చెంప పగలగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా.. డీకే అహంకార ధోరణి ప్రదర్శించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News