Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు..?

కర్నాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సీఎం సిద్దరామయ్య మంత్రివర్గంలో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది.

Update: 2025-10-10 07:03 GMT

Karnataka Cabinet Reshuffle Imminent: కర్నాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సీఎం సిద్దరామయ్య మంత్రివర్గంలో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. అధికార మార్పిడిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్ల పదవి కాలం ఒప్పందం ముగిసినందున త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రుల్లో 50 శాతం మందిని తొలగించి.. కొత్తవారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

బీహార్ ఎన్నికల తర్వాత వ్యూహత్మకంగా మంత్రుల మార్పు ఉంటుందని తెలుస్తోంది. మరో వైపు ఈనెల 13న కేబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మరో వైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై తనకు ఎలాంటి సమచారాం లేదని డీకే శివకుమార్ చెప్పారు. నాయకత్వ మార్పు గురించి పార్టీలోనే ఎప్పటి నుంచో ఊహాగానాలు వెలువడుతున్నాయని... ఇది ముఖ్యమంత్రికి, పార్టీకి సంబంధించినదని అన్నారు. తాను పార్టీ కోసం పని చేస్తానని.. ఏ విషయంలోనూ జోక్యం చేసుకోనన్నారు.

కొత్తవారిని క్యాబినెట్ లోకి తీసుకుంటే ..ఆ వెంటనే సీఎం మార్పుపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం కష్టతరం అవుతుందని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ అధిష్టానంతో చర్చించిన సందర్బంలో సీఎం సిద్దరామయ్య తన భవిష్యత్త ప్రణాళికలు వెల్లడించినట్టు సమాచారం. 

Tags:    

Similar News