Kanpur Encounter : వికాస్‌దూబే ప్రధాన అనుచరుడి ఎన్‌కౌంటర్‌

Update: 2020-07-08 05:22 GMT

Kanpur Encounter : ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరుడు అమర్ దూబేను పోలీసులు మట్టుబెట్టారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్ పూర్ పట్టణంలో వికాస్ దూబే అనుచరుడైన అమర్ దూబేను ప్రత్యేక పోలీసులు కాల్చి చంపారు. గత గురువారం కాన్పూరులో 8 మంది పోలీసులను హతమార్చిన వికాస్ దూబేతోపాటు అతని ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి పరారీ ఉన్న వారి కోసం పోలీసులు 40 ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.

పొరుగు రాష్ట్రాల పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వేసి ఉంచారు. అమర్ దూబే హమీర్ పూర్ లో ఉండగా పోలీసులు కాల్చిచంపారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. అమర్‌ దూబేపై రూ. 25 వేల రివార్డు ఉందని తెలిపారు. కాన్పూరులో జరిగిన 8 మంది పోలీసుల ఎన్‌కౌంటర్ కేసులో అమర్ దూబే కూడా నిందితుడని పోలీసులు పేర్కొన్నారు. బిజనూర్ పట్టణంలో వికాస్ దూబే కొందరితో కలిసి కారులో వెళుతున్నట్లు పోలీసులు సోమవారం రాత్రి గుర్తించారు. యూపీతోపాటు సరిహద్దు రాష్ట్రాల్లోనూ వికాస్ దూబే సంచారంపై ఆయా రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు.

 


Tags:    

Similar News