Kanpur Encounter : గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే అరెస్టు

Update: 2020-07-09 04:43 GMT

Kanpur Encounter : కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అరెస్టయ్యాడు. బిక్రూ గ్రామంలో తనను పట్టుకునేందుకు వచ్చిన 8మంది పోలీసులను హతమార్చి పారిపోయిన కరడుకట్టిన నేరగాడు వికాస్ దూబే ఉజ్జయిని నగరంలోని మహంకాళీ దేవాలయంలో పూజలు చేసేందుకు రావడంతో అక్కడి గార్డు అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. గ‌త వారం కాన్పూర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 8 మంది పోలీసులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో వికాస్ ప్ర‌ధాన నిందితుడు. వికాస్ కోసం గ‌త అయిదు రోజుల నుంచి యూపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ కేసుతో లింకు ఉన్న న‌లుగురు క్రిమిన‌ల్స్‌ను పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. 


Tags:    

Similar News