Jharkhand extends lockdown: జులై 31 వరకు లాక్‌డౌన్..

Jharkhand extends lockdown:దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. టెస్టులు పెంచే కొద్ది వేలాదిగా పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భావించిన రాష్ట్రాలు లాక్ డౌన్ ను కొనసాగుతూనే ఉన్నాయి.

Update: 2020-06-27 07:23 GMT

Jharkhand extends lockdown: దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. టెస్టులు పెంచే కొద్ది వేలాదిగా పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భావించిన రాష్ట్రాలు లాక్ డౌన్ ను కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఝార్ఖండ్ ప్రభుత్వం లాక్ డౌన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జులై 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. లాక్ డౌన్ సందర్భంగా రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్లపై ఎవరూ రాకూడదని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం హేమంత్ తెలిపారు.

ఇందులో భాగంగా క్రీడలు, వినోదం, విద్యా, సామాజిక, రాజకీయ,మత పరమైన కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక స్కూల్లు, కాలేజ్‌లు, ఇతర విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్ లు, ఆడిటోరియాలను యధావిధిగా ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంతవరకూ మూసివేయాలని సీఎం హేమంత్ సోరెన్ ఆదేశించారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలపై కూడా నిషేధం విధించినట్టు స్పష్టం చేశారు. ఇదివరకు షాపింగ్ మాల్స్, హోటళ్లు, ధర్మశాలలు, లాడ్జీలు, రెస్టారెంట్ లపై ఇచ్చిన సడలింపులు సైతం వెనక్కితీసుకుంటున్నట్టు ప్రకటించారు. కాగా ఝార్ఖండ్ లో ఇప్పటి వరకు 2,262 కరోనా కేసులు నమోదు కాగా.. 1507 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మరణించారు.


Tags:    

Similar News