కరోనా నేపధ్యంలో ఏపీలో పాఠశాలలకు కొత్త రూల్స్

కరోనా నేపధ్యంలో ఏపీలో పాఠశాలలకు కొత్త రూల్స్
x
Highlights

మ‌హ‌మ్మారి కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుద‌ల చేసింది.

మ‌హ‌మ్మారి కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుద‌ల చేసింది.క్లాస్ రూములో 30మంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉంటే.. రెండు విడ‌త‌లుగా విభ‌జించి విద్యాబోధ‌న చేయాల‌ని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. క‌రోనా వ్యాప్తి అదుపులోకి వ‌చ్చి సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్పడే వ‌ర‌కు మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థుల‌కు సరకులను పంపిణీ చేయాలని చెప్పింది.

ఏపీలో పాఠశాలల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సమూహంగా విద్యార్ధుండే అవకాశం ఉండటం వల్ల కరోనా వ్యాప్తి చెందేందుకు దోహదపడుతుందని భావించిన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ,చేపట్టింది. శానిటైజ్ తో పాటు సమూహాల్లేకుండా . అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది.

స్కూల్ తెరిచే సమయంలో ఇలా..

- పాఠశాల ఆవరణను పూర్తిగా శానిటైజ్ చెయ్యాలి..క్రిమిసంహారాల‌తో కరోనా వైరస్‌ రహితంగా శుద్ధి చేయాలి.

- ఎంట్రన్స్ వ‌ద్ద స్టూడెంట్స్ టెంప‌రేచ‌ర్ పరిశీలించాలి.

- టీచ‌ర్స్, స్టూడెంట్స్ తప్పనిసరిగా మాస్కులు ధ‌రించాలి.

- 30మంది పిల్లలకు రెండు చొప్పున ఆటోమేటెడ్‌ చేతులు కడిగే యంత్రాలు ఏర్పాటు చేయాలి.

- యూనిఫామ్ తో పాటు క‌ర్చీప్ కూడా త‌ప్ప‌నిసరి

- సబ్బులు, శానిటైజర్లను స్కూలు యాజ‌మాన్యం అందుబాటులో ఉంచాలి

- తాగునీరు, మధ్యాహ్న భోజనానికి విడతకు 10 మందికి మించి ఉండకూడదు.

- మా‌ర్నింగ్ ప్రేయ‌ర్ రద్దు. క్లాసులో ఉండి మైకుల ద్వారా చేసుకోడానికి అనుమ‌తి

- 30మంది స్టూడెంట్స్ మించి ఉంటే ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 12.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండు విడతల్లో క్లాసులు నిర్వహించాలి.

- 50-100మంది ఉంటే రోజు విడిచి రోజు క్లాసెస్ నిర్వహించాలి

- ప్రతి రోజు పావుగంట‌ కొవిడ్‌-19 నివారణ చర్యలను వివరించాలి

- గేమ్స్ పీరియడ్‌ను రద్దు చేయాలి. వ్యక్తిగత వ్యాయామాలు, యోగా నేర్పించవచ్చు

- 'నో స్కూల్‌ బ్యాగ్‌ డే' త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాలి. పిల్లల్లో ఒత్తిడి తగ్గించేందుకు మూవీస్ లాంటివి చూపించాలి.

పరీక్షల నిర్వహణ స‌మ‌యంలో..

- ఎగ్జామ్ సెంట‌ర్స్ వద్ద శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాలి.

- ఒక్కో గదిలో 10మందిని మాత్రమే ఎగ్జామ్ కు అనుమతించాలి.

- కంటోన్మెంట్, కట్టడి ప్రాంతం నుంచి వచ్చే స్టూడెంట్స్ కు కలెక్టర్లు రవాణా సదుపాయం కల్పించాలి.

- కరోనా సింట‌మ్స్ ఉండే వారి కోసం ప్రత్యేక ఐసొలేషన్‌ గది ఏర్పాటు చేయాలి.

- వాల్యువేష‌న్ సెంటర్లను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories