Corona out break in Telangana:తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Corona out break in Telangana:తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 985 కేసులు నమోదు అయ్యాయి

Krishna
Published on: 26 Jun 2020 10:49 PM IST
Corona out break in Telangana:తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
X

తెలంగాణలో కరోనా కేసులు(Corona out break in Telangana) రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 985 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక్క GHMC పరిధిలోనే 774 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 86, మేడ్చెల్ లో 53 , వరంగల్ అర్బన్ లో 20 ,రాజన్నా సిరిసిల్లా జిల్లాలో 06, సిద్దిపేట లో 03, ములుగులో 02, జగిత్యాలలో 02, మెదక్ లో 09, ఆదిలాబాద్ లో 07, భూపాల్ పల్లిలో 03, ఖమ్మంలో 03, నాగూర్ కర్నూల్ లో 06, యదాద్రి భువనగిరిలో 02, నిజామాబాద్ లో 06, మిర్యాలగూడ, వికారాబాద్, మహబూబ్ నగర్ లో ఒక్కో కేసు నమోదు అయింది.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12,349 కి చేరింది. ఇందులో 7,436 యాక్టివ్ కేసులు ఉండగా, 4,766 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇవ్వాలా కరోనాతో ఏడుగురు మృతి చెందగా, 78 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక అటు తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడిని అడ్డుకోవడానికి ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే!





Krishna

Krishna

Next Story