Jharkhand: విశ్వాస పరీక్ష నెగ్గిన హేమంత్‌ సోరెన్‌..

Jharkhand: జార్ఖండ్ లో విశ్వాస పరీక్షలో సోరెన సర్కార్ నెగ్గింది.

Update: 2022-09-05 09:16 GMT

Jharkhand: విశ్వాస పరీక్ష నెగ్గిన హేమంత్‌ సోరెన్‌..

Jharkhand: జార్ఖండ్ లో విశ్వాస పరీక్షలో సోరెన సర్కార్ నెగ్గింది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వెంటనే సభలో విశ్వాస పరక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం సోరెన్. కాసేపు చర్చ కొనసాగిన తర్వాత ఓటింగ్ నిర్వహించారు. హేమంత్ సోరెన్ సర్కార్ కు మద్దతుగా 48 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ లో మెజారిటీకి 42 సీట్లు అవసరం ఉంది.

అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్ కు లేఖ రాయడంతో రాష్ర్టంలో రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. అసెంబ్లీ ఓటింగ్ కు ముందు బీజేపీ పై సీఎం సోరెన్ విమర్శలు గుప్పించారు. కమలం పార్టీ ప్రతిరోజు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు ఆ పార్టీ పని చేస్తుందని మండిపడ్డారు. 

Tags:    

Similar News