Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ చేసిన జెలియోస్ కంపెనీ
Electric Scooter: 20పైసల ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం * మార్కెట్ ధర రూ.47వేలు
జెలియస్ ఎలక్ట్రిక్ స్కూటర్ (ఫైల్ ఇమేజ్)
Electric Scooter: ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ వైపు చూస్తోంది. దీంతో కొత్తగా వ్యాపారంలోకి వస్తోన్న యువత. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఫోకస్ పెంచారు. వినూత్న ఆవిష‌్కరణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జెలియోస్ స్టార్టప్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించింది. 20 పైసల ఖర్చుతో కిలోమీటర్ దూరం ప్రయాణించేలా ఈ స్కూటర్‌ను తయారు చేశారు. మార్కెట్‌లో దీని ధర 47వేలు ఉంటుందని తెలిపారు కంపెనీ వ్యవస్థాపకులు ఆదిత్య తివారీ.