Bihar polls: ఎన్డీఏలో సీట్ల పంపకాలు పూర్తి.. ఎవరికెన్నంటే..

ఎన్డీఏలో సీట్లు ఖరారు అయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 115 నియోజకవర్గాల్లో జనతాదళ్ (యునైటెడ్) పోటీ చేస్తుందని బీహార్ సీఎం నితీష్..

Update: 2020-10-06 12:33 GMT

ఎన్డీఏలో సీట్లు ఖరారు అయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 115 నియోజకవర్గాల్లో జనతాదళ్ (యునైటెడ్) పోటీ చేస్తుందని బీహార్ సీఎం నితీష్ కుమార్ మంగళవారం చెప్పారు. విలేకరుల సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమిలోని జెడియుకు 122 సీట్లు కేటాయించడం జరిగిందని.. అయితే అందులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితాన్ రాయ్ మాంజీ యొక్క హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీకి ఏడు సీట్లు ఇవ్వాలని నిర్ణయించామని నితీష్ కుమార్ చెప్పారు. అలాగే బిజెపికి కేటాయించిన 122 సీట్లలో రెండు మిత్రపక్ష పార్టీలకు 15 సీట్లు కేటాయించిందని తెలిపారు.

దీంతో సీట్ల కేటాయింపు ప్రక్రియ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్టే అని చెప్పారు. సీట్ల కేటాయింపుపై ఎన్డీయే భాగస్వాములు మధ్య ఎలాంటి గందరగోళం లేదని నొక్కిచెప్పారు. ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. దీనిపై కూడా త్వరలోనే స్పష్టత వస్తుందని అన్నారు. ఇక కచ్చితంగా ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని ఆయన అన్నారు. ఆర్జేడీ అధికారంలో ఉన్న గత 15 ఏళ్లలో రాష్ట్రం చాలా వెనుకబాటుతనానికి గురైందని నితీష్ చెప్పారు.

Tags:    

Similar News