ASIను కాల్చి చంపిన కానిస్టేబుల్
Chhattisgarh: చత్తీస్‌గడ్ రాయపూర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఓ కానిస్టేబుల్ ఎస్సైపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హతమార్చాడు.
Chhattisgarh: చత్తీస్‌గడ్ రాయపూర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఓ కానిస్టేబుల్ ఎస్సైపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హతమార్చాడు. ఈ ఘటన ఖరోరా పిఎస్ పరిధిలోని ముదిపర్ ఐటీబీపీ 38వ బెటాలియన్ క్యాంప్‌లో చోటుచేసుకుంది. ASI దేవేంద్ర సింగ్ దహియా తనను కవాతు చేస్తుండగా మందలించాడని కానిస్టేబుల్ సరోజ్ కుమార్ కోపం పెంచుకున్నాడు.
ఆ కారణంతోనే సర్వీస్ రివాల్వర్‌తో ఏఎస్‌ఐని కాల్చి చంపాడు. నుదుటిపై 2 సార్లు... ఛాతీపై 15 బుల్లెట్లను కాల్చాడు సరోజ్ కుమార్. విషయం తెలుసుకున్న ఖరోరా పోలీస్‌స్టేషన్ సిబ్బంది సరోజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.