Coronavirus: మరణాల్లో చైనాను దాటేసిన ఇటలీ..

ఇటలీలో కరోనావైరస్ (COVID-19) వ్యాప్తి చెందడంతో మరణించిన వారి సంఖ్య గత 24 గంటల్లో 427 పెరిగి 3,405 కు చేరుకుంది, దీంతో ఇప్పటివరకు చైనాలో నమోదైన మొత్తం మరణాల సంఖ్యను అధిగమించిందని అధికారులు గురువారం తెలిపారు.

Update: 2020-03-20 03:58 GMT
coronavirus deaths in Italy

ఇటలీలో కరోనావైరస్ (COVID-19) వ్యాప్తి చెందడంతో మరణించిన వారి సంఖ్య గత 24 గంటల్లో 427 పెరిగి 3,405 కు చేరుకుంది, దీంతో ఇప్పటివరకు చైనాలో నమోదైన మొత్తం మరణాల సంఖ్యను అధిగమించిందని అధికారులు గురువారం తెలిపారు.చైనా కంటే 150 మంది ఎక్కువగా ఇటలీలో (COVID-19) ద్వారా మరణించినట్టు.. అలాగే ఒక్క గురువారమే 475 మంది మరణించినట్లు గురువారం గణాంకాలు సూచించాయి.. ఆరోగ్య అధికారులు.. ఇటలీలో అధిక మరణాలు నమోదు కావడానికి వివిధ కారణాలను ఉదహరించారు, వారిలో పెద్ద సంఖ్యలో వృద్ధులు ఉన్నారు, వీరు వైరస్ నుండి తీవ్రమైన సమస్యలకు గురవుతారు, అయినప్పటికీ చిన్న వయసు రోగులలో కూడా తీవ్రమైన కేసులు కనిపిస్తున్నాయి.

కాగా ఇటలీ ప్రపంచంలో రెండవ - వృద్ధ జనాభాను కలిగి ఉంది, వైరస్ తో చనిపోయిన వారిలో ఎక్కువ శాతం - 87% మందికి పైగా ఉన్నారు. గత మూడు రోజులుగా చైనాలో పెద్దగా కొత్త కేసులు అయితే నమోదు కాలేదు. ఒకటి అరా వచ్చినా అవి అనుమానిత కేసులుగానే ఉన్నాయని ఆ దేశ ఆరోగ్య శాఖ చెబుతోంది. చైనా తరువాత అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో ఇటలీ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చైనాలో గత మూడు నెలలుగా ఈ మరణాలు సంభవిస్తే.. ఇటలీలో మాత్రం కేవలం నెల రోజుల వ్యవధిలోనే 3,405 మరణాలు నమోదు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది ఆందోళన కలిగించే అంశమని.. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇదిలావుంటే యుఎస్ లోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 220,000 మంది ప్రజలు కరోనావైరస్ సోకింది.. వీరిలో కనీసం 84,000 మంది COVID-19 నుండి కోలుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 10,000 కు చేరుకుంది. పాఠశాలలు మూసివేయడం, నగరాలను మూసివేయడం మరియు కఠినమైన సరిహద్దు నియంత్రణలను విధించడం ద్వారా ప్రపంచం కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

Tags:    

Similar News