PSLV-C56: ప్రయోగాల పరంపర కొనసాగిస్తున్న ఇస్రో.. రేపు ఉదయం పీఎస్‌ఎల్‌వీ - సీ 56 రాకెట్ ప్రయోగం..
PSLV-C56: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగాల పరంపరను కొనసాగిస్తోంది.
PSLV-C56: ప్రయోగాల పరంపర కొనసాగిస్తున్న ఇస్రో.. రేపు ఉదయం పీఎస్‌ఎల్‌వీ - సీ 56 రాకెట్ ప్రయోగం..
PSLV-C56: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగాల పరంపరను కొనసాగిస్తోంది. PSLV సీరీస్‌లో మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు PSLV - C 56 రాకెట్‌ను ప్రయోగించేందుకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ సన్నద్ధమైంది. నేటి ఉదయం 5గంటల ఒక నిమిషానికి కౌంట్ డౌన్ మొదలైంది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి రేపు ఉదయం 6 గంటల 31 నిమిషాలకు PSLV - C 56 రాకెట్ నింగిలోకి ఎరగనుంది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు రోదసిలోకి పంపనున్నారు. డీఎస్ - షార్ ఉపగ్రహం ఇందులో ప్రధానమైనది. దీంతో పాటు వెలాక్స్ AM, ARCADE, SCOOT - టూ, నులియన్, గెలాసియా - టూ, ORB - ట్వెల్వ్ ఉపగ్రహాలను ఈ రాకెట్ మోసుకెళ్లనుంది. షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై... ప్రయోగానికి సంసిద్ధత తెలిపింది. కౌంట్ డౌన్ ముగియగానే షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV - C 56 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.