IRCTC Scam: బీహార్ లో ఎన్నికల వేళ లాలు ఫ్యామిలీకి బిగ్ షాక్
IRCTC Scam: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది.
IRCTC Scam: బీహార్ లో ఎన్నికల వేళ లాలు ఫ్యామిలీకి బిగ్ షాక్
IRCTC Scam: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. ఐఆర్టీసీ కుంబకోణం కేసుకు సంబంధించి లాలు ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్త యాదవ్ లపై అభియోగాలు మోపాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. అభియోగాలను నమోదు చేసింది. దీంతో కేసువిచారణ దశకు చేరుకుంది. ఐఆర్‌టీసీ కేసులో లాలు ప్రసాద్ యాదవ్ కుట్రకు పాల్పడ్డారని, తన పదవిని దుర్వినియోగం చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అవినీతి, క్రిమినల్ కుట్ర, మోసం వంటి పలు అభియోగాలను ఖరారు చేశారు.
2017లో లాలు కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగాఉన్న సమయంలో ఐఆర్.టీసీ హోటళ్ల నిర్వహాణ కాంట్రాక్టులను ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడంలో అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. తాజాగా ఛార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐ ఆరోపణలతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏకీభవించింది. ఐఆర్.టీ.సీ కేసులో అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ స్పందిస్తూ అభియోగాలు మోపినంత మాత్రాన దోషులం కాదని.. విచారణను ఎదుర్కొంటామని వెల్లడించారు.