India: వ్యాక్సిన్‌ మెటీరియల్‌ను అడ్డుకుంటున్న అమెరికా, జర్మనీ

India: దేశంలో కరోనా వ్యాక్సిన్ల తయారీకి అమెరికా, జర్మనీ వంటి దేశాలు ఆటంకాలు కల్పిస్తున్నాయి.

Update: 2021-04-15 15:41 GMT

India: వ్యాక్సిన్‌ మెటీరియల్‌ను అడ్డుకుంటున్న అమెరికా, జర్మనీ

India: దేశంలో కరోనా వ్యాక్సిన్ల తయారీకి అమెరికా, జర్మనీ వంటి దేశాలు ఆటంకాలు కల్పిస్తున్నాయి. మనదేశం అంతర్జాతీయ బాధ్యతలతో ఇతర దేశాలకు కూడా టీకాలు సరఫరా చేస్తోంది. అయినప్పటికీ, వ్యాక్సిన్ల తయారీలో ఉపయోగించే ముఖ్యమైన మెటీరియల్‌ను ఎగుమతి చేయకుండా అడ్డుకుంటున్నాయి. వ్యాక్సిన్ల తయారీలో అత్యంత కీలకమైన ఈ మెటీరియల్‌ను..ఇప్పటికిప్పుడు వేరొక చోటు నుంచి సమకూర్చుకోవాలంటే కనీసం ఆరు నెలలైనా పడుతుంది. భారత ఫార్మా కంపెనీలు అమెరికా, జర్మనీల నుంచి రా మెటీరియల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. అమెరికా, యూరోప్‌ ప్రజలకు తమ వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడానికి ఆయా దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

Tags:    

Similar News