India's reply to Pakistan: పాకీస్థానీలకు 48 గంటల గడువు...దేశం విడిచిపోవాల్సిందిగా ఇండియా వార్నింగ్

Pahalgam terrorists attack latest news: పహల్గాం ఉగ్రదాడి పాకిస్థాన్ చేసిన కుట్రగానే భావిస్తున్నట్లు భారత్ ప్రకటించింది.

Update: 2025-04-23 17:17 GMT

Pahalgam terrorists attack: పాకీస్థానీలకు 48 గంటల గడువు...దేశం విడిచిపోవాల్సిందిగా ఇండియా వార్నింగ్

 

Pahalgam terrorists attack: పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఒక ఇండియన్ నేవీ ఆఫీసర్, మరొక ఇంటెలీజెన్స్ బ్యూరో ఆఫీసర్ కూడా ఉన్నారు. పాకిస్థాన్ కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పహల్గాం ఉగ్రదాడి పాకిస్థాన్ చేసిన కుట్రగానే భావిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. భారత్ దర్యాప్తులోనూ ఉగ్రవాదులు పాకిస్థాన్ గుండానే వచ్చినట్లు తేలింది. దీంతో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా క్యాబినెట్ కమిటీ కఠిన నిర్ణయాలు తీసుకుంది.

దేశ భద్రతపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడంలో సీసీఎస్ (క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యురిటీ) కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా సీసీఎస్ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల్లో ఐదు ముఖ్యమైన అంశాలున్నాయి.

1 ) అందులో మొదటిది భారత్ ఇండస్ ట్రీటి ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

2 ) భారత్ - పాకిస్థాన్ మధ్య రహదారి మార్గమైన వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు స్పష్టంచేసింది.

3 ) పాకిస్థానీలకు ఇచ్చిన SAARC వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన భారత్... 48 గంటల్లోగా వారిని దేశం విడిచివెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది.

4 ) ఇకపై పాకిస్థానీలకు SAARC వీసాలు ఇచ్చే ప్రసక్తే లేదని భారత్ ప్రకటించింది.

5 ) పాకిస్థాన్‌లో ఉన్న ఇండియన్ హై కమిషన్ కార్యాలయం నుండి సిబ్బందిని ఉపసంహరించుకుంటున్నట్లు భారత్ స్పష్టంచేసింది.

రాబోయే రోజుల్లో పాకిస్థాన్ పట్ల తమ వైఖరి ఎంత కఠినంగా ఉండనుందనే విషయాన్ని భారత్ ఈ ఐదు కఠిన నిర్ణయాలతో తేల్చిచెప్పింది. మున్ముందు ఇంకా మరిన్ని కఠినమైన నిర్ణయాలు వెలువడే అవకాశం లేకపోలేదు. 

Tags:    

Similar News